హైదరాబాద్: రేవంత్ రెడ్డి.. తెలంగాణ నీ అయ్యా జాగీరా..:? కేటీఆర్

75చూసినవారు
రైతుల గురించి మాట్లాడాలంటే అసెంబ్లీ నుంచి పారిపోతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లో అయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణ, కొడంగల్ నీ అయ్యా జాగీరు అనుకుంటున్నావా? రైతులు వాళ్ల సొంత భూములు ఇవ్వమని అంటే వాళ్లకు బేడీలు వేసి జైల్లో పెడతావా? రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజు అనుకుంటున్నావా? శాసన సభలో రైతుల గురించి చర్చ పెట్టమంటే ధమ్ములేక పారిపోయిన దద్దమ్మవి అంటూ ధ్వజమెత్తారు.

సంబంధిత పోస్ట్