సైదాబాద్ లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు

80చూసినవారు
సైదాబాద్ లో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
సైదాబాద్ డివిజన్ లో తెలంగాణ పదవ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రెడ్డి బస్తీలో నిర్వహించిన వేడుకల్లో సైదాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణాలతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వర్ణాలతారెడ్డి జాతీయ జెండా ఎగుర వేసారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంచి పెట్టారు. కార్యక్రమంలో సైదాబాద్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్