మీదాని పరిధిలో గల పిసల్ బండలో ఓ ఇంటి భయట పార్క్ చేసిన యాక్టివా స్కూటీ చొరీకి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పిసల్ బండలో ఓ వ్యక్తి తన ఇంటి ముందు బైకును పార్క్ చేయగా ఓ గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్క్ కప్పుకుని నకిలీ తాళం ఉపయోగించి దాన్ని తీసుకెళ్ళాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. శనివారం బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేయగా గాలింపు చర్యలు చేపట్టారు.