జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజేఆర్ నగర్లో రోడ్డు ప్రమాదంలో 18 నెలల జయశ్రీ మృతి చెందింది. ఇంట్లో నుంచి ఆడుకుంటూ బయటికి వస్తున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో డాక్టర్లు పరిశీలించిన అనంతరం జయశ్రీ మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.