చర్లపల్లి టర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం సోమవారం ఉదయం 10 గంటలకు వర్చువల్గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రూ. 500 కోట్లతో స్టేషన్ను అభివృద్ధి చేశామని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ టర్మినల్తో పాటు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు.