నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. సూరానా వైర్స్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.