ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన

68చూసినవారు
ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన
మల్కాజిగిరి పరిధి నేరేడ్మెట్లోని ఇంటర్మీడియట్ డీఈఓ జిల్లా ఆఫీస్ ముందు ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇవ్వాలని, ఎండలు విపరీతంగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ నర్సింహారెడ్డికి ఎస్ఎఫ్ఎ జిల్లా కార్యదర్శి సంతోష్ రాథోడ్, ఉపాధ్యక్షుడు అరుణ్, సభ్యుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్