నీలోఫర్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. బెడ్లు లేక కింద కూర్చొని పిల్లలకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పిల్లలకు ఎమర్జెన్సీ వార్డులో బెడ్లు లేక ఒకే బెడ్డుపై ముగ్గురు, నలుగురు పిల్లలను ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఒకరి ఇన్ఫెక్షన్ ఇంకొకరికి సోకుతుందేమోనని తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఈ సమస్యలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.