డివిజన్ లో మిషన్ భగీరథ వాటర్ సమస్య ప్రతి కాలనీలో ఉండుటవలన మూడు, నాలుగు రోజులకు ఒకసారి కాలనీలకు వాటర్ సప్లై చేస్తున్నారు. ఈ సమస్యను కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ శనివారం అధికారులతో చర్చించి రోజు మార్చి రోజు వాటర్ సప్లై చేయవలసిందిగా కోరారు. క్రాంతి కాలనీలో ఉన్న వాటర్ ట్యాంక్ నిండి నప్పుడు ట్యాంక్ పై నుండి వాటర్ పోతుంది. స్థానిక వాసులు ఇబ్బందికరంగా ఉందని అలా జరగకుండా తగు చర్యలు తీసుకోవాలి కోరారు.