మేడ్చల్: వాహనం అదుపుతప్పి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

69చూసినవారు
మేడ్చల్: వాహనం అదుపుతప్పి ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన సంఘటన శనివారం శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. శామీర్ పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుండి అలియాబాద్ సమీపంలోని హెచ్ బి ఎల్ కంపెనీ వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో శీలం దుర్గ ప్రసాద్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. పోహునూరి నాగవంశికి గాయాలు అయ్యాయని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్