హైదరాబాద్ నగరంలోని ఫుడ్ లవర్స్ బయటి ఆహారం తినాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి. ఇంతకుముందు ఆహారంలో పురుగులు రాగా. తాజాగా శుక్రవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బావర్చీ రెస్టారెంట్లో ఓ వ్యక్తికి బిర్యానీలో ట్యాబ్లెట్లు వచ్చాయి. దీంతో వారు వీడియో తీస్తుండగా. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.