రాంనగర్ డివిజన్ భరణి ఆయిల్ డిపో పక్క లైన్ లో జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పలు సమస్యల గురించి సోమవారం ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలు వివరించారు. రోడ్డు పనులు, మంచినీటి సమస్య, వీధి దీపాల సమస్య, నీటి సమస్య ఈయనకు వివరించారు. అధికారులతో మాట్లాడి వెంబడే సమస్యను పరిష్కరించాలని అధికారులను చరవాణిలో ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముఠా జయసింహ, డివిజన్ అధ్యక్షుడు శంకర ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.