ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో మూడు లక్షల 50 వేలతో మంచినీటి పైపులైను పనులను ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠాగోపాల్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాంనగర్ కార్పొరేటర్ రవి చారి, యువ నాయకుడు ముఠా జయసింహ శంకర్ ముదిరాజ్, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తీ ప్రభాకర్, వాటర్ వర్క్స్ మేనేజర్ జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.