ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి విద్యానగర్ వెళ్లే రహదారిలో వీఎస్టీ చౌరస్తా వద్ద డ్రైనేజీ మురుగునీరు పొంగిపొర్లుతూ రోడ్డు మొత్తం కుంటగా మారిపోయింది. రోడ్డుపై మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతోందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని శుక్రవారం స్థానికులు కోరారు.