తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. గురువారం హైదరాబాద్ సైఫాబాద్ నుండి ఎడ్లబండిపై ఎక్కి అసెంబ్లీకి బయల్దేరారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని వారు ఆరోపించారు. రూ. 2లక్షల రుణమాఫీ జరగలేదని, సభలో రైతులపై చర్చ జరగడం లేదని విమర్శించారు.