అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు లగచర్ల రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ నిన్న ప్లకార్డులను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. నేడు నల్ల చొక్కాలు ధరించి చేతులకు బేడీలు వేసుకుని నిరసన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం అగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. నిరసనల్లో ఎమ్మేల్యేలు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, దెవిరెడ్డి సుధీర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.