మహిది పట్నం డివిజన్ అయోధ్య నగర్ కాలనీలో కనకదుర్గ ఆలయం వద్ద వాటర్ లైన్ ఓవర్ ఫ్లోతో మంచినీరు వృథాగా పోతోంది. ప్రతి వారం ఇదే తంతు ఉంటుందని కాలనీవాసులు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో సరిగ్గా నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ మాత్రం మంచినీళ్లు వృథాగా పోతోందని మండిపడ్డారు. కేవలం సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని కోరారు.