అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి అయ్యేలా చూస్తామని మల్లేపల్లి డివిజన్ కార్పొరేటర్ జాఫర్ ఖాన్ అన్నారు. శనివారం డివిజన్ పరిధిలోని సితారాంబగ్ లో అయన పర్యటించారు. స్థానికంగా డ్రైనేజీ పనులు పెండింగ్ లో ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా. వెంటనే కాంట్రాక్టర్, అధికారులతో మాట్లాడి త్వరగా పనులు పూర్తి అయ్యేలా చూస్తామని కార్పొరేటర్ వారికి హామీ ఇచ్చారు.