నాంపల్లి: జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

73చూసినవారు
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే 194వ జయంతి వేడుకలను జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్లు సావిత్రీ బాయి పూలే పౌండేషన్ సీఈవో పరమేశ్వరి తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రి భాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్