కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సుచిత్ర చౌరస్తా సమీపంలో నవంబర్ 30వ తారీకు అర్ధ రాత్రి దారిన వెళ్ళే బాటసారుడిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన ఆరుగురు నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. చదువు మధ్యలో ఆపి జల్సాలకు అలవాటు పడ్డ కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన 6 యువకులుగా గుర్తించారు. బంగారు గొలుసుని స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్ కు తరలించారు.