కుత్బుల్లాపూర్ నియోజక వర్గం షాపూర్ నగర్ రోడ్డు పక్కన జీవిస్తున్న కుటుంబానికి రహదారి విస్తరణలో ప్లాస్టిక్ కవర్ల గుడిసె కూడా తొలగించారు. సామాన్లపై ప్లాస్టిక్ కవర్లు కప్పుకొని ముగ్గురు పిల్లలతో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ జీవనం సాగిస్తుంది. సీపీఎం పార్టీ తరపున సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ నరసింహని కలిసి ఆ కుటుంబానికి ఇల్లు మంజూరు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.