కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి పోయిన నెల నవంబర్ 22వ తారీకు న సెంట్ మార్టిన్ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న మృతుడి కేసును పోలీసులు సోమవారం ఛేదించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులైన భార్య బత్తుల సంగీత(24), బత్తుల లక్ష్మి(38), ఆటో డ్రైవర్ కాశీనాథ(52) లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పేట్ బషీరాబాద్ ఏ. సి. పి తెలిపారు.