క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం కేక్ కట్ చేశారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో బోయగూడలోని సెయింట్ ఫీలోమీనా చర్చి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ను ఎమ్మెల్యే కట్ చేసి చర్చి ప్రతినిధులకు తినిపించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి ప్రతినిధులు డిసిల్వా, సదాయ్ రాజ్, జయరాజ్ , రాజు, అత్తిలి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.