వెంగల్ రావు నగర్ డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద 33 కేవి లైన్ లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాలు. 33 కేవీ లైన్ వల్ల స్థానికంగా ఉండే ఇళ్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇంట్లో ఉండే వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఏమి కాలేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు వాపోయారు.