బేగంపేట్ లోని ప్రజాభవన్ లో నిర్వహించిన ప్రజావాణిలో డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. శుక్రవారం నాటి ప్రజావాణిలో మొత్తం 509 అర్జీలు దాఖలు అయ్యాయి. ప్రజావాణి ఇన్ఛార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులను తీసుకుని సంబంధిత అధికారులకు అందించారు. ఆయా శాఖల అధికారులకు ఫోన్ చేసి మాట్లాడి అర్జీదారుల సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు.