పేద ప్రజల మనిషి ఆరేపల్లి పరశురామ్

699చూసినవారు
పేద ప్రజల మనిషి ఆరేపల్లి పరశురామ్
గత 25 సంవత్సరాలుగా కంటోన్మెంట్ బోర్డులో ఉన్నతాధికారిగా విధులు నిర్వహించిన ఆరేపల్లి పరుశురామ్, తన 12 ఏళ్ల సర్వీస్ ఉండగానే, నియోజకవర్గ అభివృద్ధి చెందడం లేదని, తన విధులకు రాజీనామా చేసి, రాజకీయాల్లోకి వస్తున్న సందర్భంగా మంగళవారం కంటోన్మెంట్ నియోజకవర్గం, మడ్ ఫోర్డ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్, అరుణ్, మధు, రాజ్ కుమార్, మనోజ్, లు ఆరేపల్లి పరశురామ్ ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా, బొకేతో, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మాలాంటి పేద ప్రజలకు, మీ సేవలు మాకు ఎంతో అవసరమని మీ వెంట మేముంటామని, నీ గెలుపు మా లక్ష్యం అని వారు సంతోషం వ్యక్తం చేశారు. వీరితోపాటు నియోజకవర్గ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్