చెరువు గాంధీ కమ్యూనిటీ హాల్ ని ఉపయోగంలోకి తీసుకురండి

71చూసినవారు
చెరువు గాంధీ కమ్యూనిటీ హాల్ ని ఉపయోగంలోకి తీసుకురండి
కంటోన్మెంట్ నియోజకవర్గం, తిరుమలగిరిలోని చెరువు అభివృద్ధికై ఎన్ని సార్లు స్థానిక కంటోన్మెంట్ బోర్డ్ ను కోరినా, నిధులు లేవు అని, కాలయాపన చేస్తున్నారని, కంటోన్మెంట్ బోర్డుతో పరిష్కారం కాదని, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని, సుందరీకరణ చేపట్టాలని, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ కోరారు. బుధవారం నాడు డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ని, మన్నె క్రిషాంక్, కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్యరాసాని శ్యామ్ కుమార్ కలిశారు.

అరవింద్ కుమార్ సానుకూలంగా స్పందించారు. దాని తరువాత 7వ వార్డు లో గాంధీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఉన్న చెత్త డంపింగ్ యార్డును కూడా తరలించే విధంగా, ఆర్మీ అధికారులపై ఒత్తిడి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ 7వ వార్డు వైస్ ప్రెసిడెంట్ యశ్వంత్ కుమార్, సీనియర్ బిఆర్‌ఎస్ నాయకుడు హెచ్. పాండు రంగా తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్