సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలు కాపాడిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. శనివారం పికెట్లోని తన కార్యాలయం వద్ద లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మొత్తం 36 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన వారు తప్పకుండా సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.