ఓల్డ్ బోయిన్‌పల్లి: శాశ్వత పరిష్కారం చూపాలని వినతి

55చూసినవారు
ఓల్డ్ బోయిన్‌పల్లి హస్మత్‌పేటలో తరచూ డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. దీంతో రోడ్లపై మురుగునీరు చేరడంతో దుర్వాసన వచ్చి ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు గురువారం తెలిపారు. దీనిపై సిబ్బంది దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా నామమాత్రపు చర్యలే ఉన్నాయన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. ట్యాక్సులు కట్టి తాము కనీస వసతులు కూడా పొందలేమా? అని ప్రశ్నిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్