సీతాఫల్మండిలో రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన కార్పొరేటర్ సామల హేమ కాంగ్రెస్ నాయకుల తీరుపై బుధవారం మండిపడ్డారు. ఎటువంటి అధికారం లేకుండా కాంగ్రెస్ నాయకులు ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఏంటని కార్పొరేటర్ ప్రశ్నించారు. దీనిపై నాయకులతో వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులు మాత్రమే ప్రారంభోత్సవంలో పాల్గొవాలి. కాసేపు ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.