సికింద్రాబాద్ కళాసిగూడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో గురువారం మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఉండాలని ఆకాంక్షించారు.