సికింద్రాబాద్: గాంధీ ఆవరణలో మరో గుర్తు తెలియని మృతదేహం

54చూసినవారు
సికింద్రాబాద్: గాంధీ ఆవరణలో మరో గుర్తు తెలియని మృతదేహం
గాంధీ ఆసుపత్రి ఆవరణలో గురువారం మరో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. గాంధీ వెయిటింగ్ హాల్ దగ్గర పడి ఉన్న దాదాపు 50-55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి డెడ్ బాడీని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఫొటోలోని వ్యక్తిని గుర్తుపట్టిన వారు పీఎస్లో తెలపాలని పోలీసులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్