హైడ్రా బాధితుల వీడియోలు పోస్ట్ చేస్తే కేసులు పెడతాం: మంత్రి

60చూసినవారు
హైడ్రా బాధితుల వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. హైడ్రా బాధితులు చట్టపరంగా పోరాడాలని సూచించారు. లేదా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టికి వారి సమస్యలను తీసుకురావాలన్నారు. కొందరు కావాలని బాధితులను రెచ్చగొట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వారిపై చర్యలు చట్టబద్ధంగా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ సీపీ దీనిపై దృష్టి సారించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్