క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం: ఎమ్మెల్యే

50చూసినవారు
క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం: ఎమ్మెల్యే
క్రీడలతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. జింఖానా గ్రౌండ్లో స్కూల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు జరగనున్న జోనల్ టోర్నమెంట్ కం సెలక్షన్ (అండర్ 14-17) ఆటల పోటీలలో ఆయన ముఖ్య అతిథిగా గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోలక్పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ కు చెందిన ఖోఖో, కబడ్డీ జట్ల విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్