సికింద్రాబాద్లో బతుకమ్మ ఆడిన పోలీసులు

50చూసినవారు
సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం వద్ద బతుకమ్మ సంబరాలు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలతో కలిసి పోలీసులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్, స్థానిక మహిళా బస్తీవాసులు, అమ్మవారి భక్తులు, మహిళా కానిస్టేబుళ్లు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఆలయంలో బతుకమ్మలను పేర్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్