సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లోవాటర్ బంద్..!

73చూసినవారు
తెలంగాణలోనే అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ సికింద్రాబాద్ గాంధీలో నిన్నటి నుంచి తీవ్ర నీటి కొరత ఏర్పడిందని రోగులు, వారి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ మోటార్ చెడిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని సిబ్బంది తెలిపారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బయట నుంచి వాటర్ బాటిళ్లు కొనుక్కుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్