ఎవరైనా ప్రభుత్వ నిషేధిత పాన్ గుట్కా మసాలాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఏసిపి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం షాద్నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలోని సీఐ నరసింహారావు ఆధ్వర్యంలో కిరాణా షాపులు, పాన్ డబ్బాలు, బెల్ట్ షాపులు, ఓయో రూములలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.