షాద్‌నగర్ ఫరూఖ్ నగర్ మండల పరిధిలో కమ్మదనం నుండి చిన్న చిల్కమర్రి గ్రామానికి వెళ్లేందుకు ఉన్న మట్టి రోడ్డు అస్తవ్యస్తంగా గుంతలు పడి ఉండడంతో రోడ్డుపై ప్రయాణించాలంటే అనేక ఇబ్బందులు పడుతున్నామని బుధవారం ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతలలో నీరు చేరి రోడ్డు బురదగా మారడంతో ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.