రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా ఏబీవీపీ నినాదం

58చూసినవారు
ఏబీవీపీ రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తీర్మానాలను ప్రవేశపెట్టడం జరిగిందని ఏబీవీపీ నాయకులు తెలిపారు. ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర 43వ మహాసభలు విజయవంతం అయిన సందర్భంగా ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థి, నిరుద్యోగ, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నినాదం తీసుకుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్