ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నిలబడి ధైర్యంగా గొంతువిప్పి మాట్లాడుతున్న మేధావుల మీద, ప్రజా నాయకులు మీద, కళానేతల మీద సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలంతో దూషిస్తూ అనాగరిక దాడులు చేస్తున్న మాలలు తమ పద్ధతిని మార్చుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయమైనది కాబట్టే లోకమంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతుందని అన్నారు.