ఏటిఎమ్‌లో నాగు పాము

52చూసినవారు
ఎస్బిఐ ఏటిఎమ్ లో నాగుపాము ప్రత్యక్షమైంది. శనివారం ఉదయం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ భవనంలోని ఎస్బిఐ ఏటిఎమ్ లో నగదు కోసం ఓ వ్యక్తి వెళ్లారు. లోపల పామును చూసిన అతడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇది గమనించిన విద్యార్థులు, సిబ్బంది అప్రమత్తమై పామును చెట్ల పొదల్లో వదిలేశారు. ఆర్ట్స్ కాలేజీ, ఏటిఎమ్ కు వచ్చే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్