సినిమా షూటింగ్.. హీరో సుమన్ సందడి

72చూసినవారు
సినిమా షూటింగ్.. హీరో సుమన్ సందడి
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట మండలం గౌరారం గ్రామ పరిసరాల్లో గురువారం శివ శంభో సినిమా షూటింగ్ నిర్వహించారు. కార్తీక మాసంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా షూటింగ్ లో పలు సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందని దర్శకుడు ఆర్. నర్సింగ్ తెలిపారు. షూటింగ్ లో హీరో సుమన్, మరో హీరో ఆజాద్, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టులు రంగరాజన్, భవాని శంకర్, వేణు, బేబీ రిషిత, కొరియోగ్రాఫర్ రోష్ని రజాక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్