హ్యుందాయ్ అయానిక్-5 కార్ల రీకాల్

72చూసినవారు
హ్యుందాయ్ అయానిక్-5 కార్ల రీకాల్
హ్యుందాయ్ మోటార్ ఇండియా 1,744 అయానిక్-5 కార్లను వెనక్కి పిలిపిస్తోంది. జులై 21, 2022 నుంచి ఏప్రిల్ 30, 2024 మధ్య తయారైన ఈ విద్యుత్ మోడల్ కార్లను కంపెనీ రీకాల్ చేస్తున్నట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) వెబ్సైట్ లోని సమాచారం చెబుతోంది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ తో సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. దీని వల్ల 12వీ బ్యాటరీ డిస్ ఛార్జి కావొచ్చని అంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్