సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని గతేడాది చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పందించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “నేను కలైంజ్ఞర్ (కరుణానిధి) మనవడిని. నేను దేనికీ క్షమాపణ చెప్పను” అని అన్నారు. తన మాటలను వక్రీకరించారన్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ "సనాధన ధర్మాన్ని తుడిచి పెట్టాలని ప్రయత్నించే వారే తుడిచిపెట్టుకుపోతారు” అని అన్నారు.