H-1B వీసాలకు నేనెప్పుడూ అనుకూలమే: డొనాల్డ్‌ ట్రంప్‌

50చూసినవారు
H-1B వీసాలకు నేనెప్పుడూ అనుకూలమే: డొనాల్డ్‌ ట్రంప్‌
హెచ్​1బీ వీసాల విస్తరణపై అమెరికా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ వైఖరి మారింది. గతంలో హెచ్​1బీ వీసా ప్రోగ్రామ్‌ను వ్యతిరేకించిన ట్రంప్‌, తాజాగా దానికి మద్దతు ప్రకటించారు. హెచ్​1బీ వీసా విస్తరణను ఒక గొప్ప కార్యక్రమంగా అభివర్ణించిన ట్రంప్‌, ముందు నుంచి తాను దీనికి అనుకూలంగానే ఉన్నానని తెలిపినట్లు న్యూయార్క్‌ పోస్టు పేర్కొంది. ట్రంప్ తొలిసారి అధికారం చేపట్టినప్పుడు హెచ్​1బీ వీసాల వల్ల అమెరికాపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని కూడా విమర్శించిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్