ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సతీమణి వీణా శ్రీవాణి పుష్ప 2 సినిమాను చూసి తన అనుభవాలను ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ‘ఇప్పుడే పుష్ప 2 మూవీ చూసేసి వస్తున్నాను. కళామతల్లి ఆశీస్సులు అల్లు అర్జున్ పై ఉన్నాయి. ఈ సినిమాలో నేను ఆయన నట విశ్వరూపం చూశాను. కళామ తల్లి ఆశీస్సులుంటే తప్ప ఇలాంటి నటన సాధ్యం కాదు. అల్లు అర్జున్ గారు.. మీకు ఇప్పట్లో తిరుగు లేదు. ఒక వంద గుమ్మడి కాయల దిష్టి తీసుకోండి’ అని పేర్కొన్నారు.