నక్షా సర్వేలో ప్రభుత్వ స్థలాలు, మురుగునీటి పారుదల వ్యవస్థ నాలాలు, చెత్త డంపింగ్ ప్రదేశాలు, నీటి వనరుల విస్తీర్ణాల కొలతలు పక్కాగా తేలనున్నాయి. వాటి హద్దులనూ గుర్తించనున్నారు. పురపాలక సంఘాల్లోని ప్రభుత్వ స్థలాల గుర్తింపు అనంతరం అవి భూ నిధిగా ఉపయోగపడనున్నాయి. ఆక్రమణలూ తేలనున్నాయి. ప్రస్తుతం GHMC పరిధిలోని చెరువులు, కుంటల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. దీంతో పట్టణాల్లోని ఆక్రమణలు వెలుగులోకి వస్తాయి.