తెలంగాణలో రూ.2 లక్షల లోపు ఉన్న రైతులకు రుణమాఫీ కాకపోతే తప్పకుండా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. BRS గత 10 ఏళ్లలో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంను చేతిలో పెడితే రూ.లక్ష రుణమాఫీ కూడా చేయలేకపోయారని విమర్శించారు. రూ.7 లక్షల అప్పు చేసి కూడా రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేసిందన్నారు. 56 వేల మందికి TGPSC ద్వారా ఉద్యోగాలు ఇచ్చామని.. ప్రభుత్వం రైతులకు బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తుందని తెలిపారు.