మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి

52చూసినవారు
మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి
ఈ రోజు విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో దాదాపు ఎన్డీయే ఆధిక్యత కనబరిచింది. ఈ క్రమంలో ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం అభ్యర్థి సోమనాథ్ భారతి ప్రకటించారు. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పని నిరూపిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్