రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి కచ్చితంగా ఎముకలు విరిగి ఉంటాయన్న భావనతోనే సహాయం అందించాలి. లేదంటే మీకు తెలియకుండానే గాయాన్ని పెంచిన వారవుతారు. విరిగిన లేదా గాయపడిన ఎముకను యథాస్థానంలో ఉంచడానికి ప్రయత్నించకూడదు. ఎముక విరిగి బయటికి వచ్చిన సందర్భాల్లో గాయాన్ని కొంత మేర శుభ్రం చేయవచ్చు. గాయపడిన వ్యక్తికి అవసరానికి మించి నీళ్లు తాగించకూడదు. ఏదైనా ఆహారం తీసుకుంటే గాయపడిన వ్యక్తికి శస్త్రచికిత్స చేయటానికి ఆలస్యం అవుతుంది.